Procter And Gamble : ప్రోక్టర్..గ్యాంబుల్ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్
గుజరాత్ లో కంపెనీ ఏర్పాటుకు ఓకే
Procter And Gamble : నిన్న గూగుల్ నేడు మరో దిగ్గజ కంపెనీ భారత్ లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మోదీ అమెరికా టూర్ ఫలితంగా పలు కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆయా కంపెనీలన్నీ కేవలం గుజరాత్ పైనే ఫోకస్ పెట్టడం పట్ల ఇతర రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ప్లేస్. ఇప్పటికే ఐసీసీ వరల్డ్ కప్ కు సంబంధించి ప్రధాన మ్యాచ్ లన్నీ గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించడం కూడా తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది.
ఈ తరుణంలో ప్రముఖ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్(Procter And Gamble) కంపెనీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. డైజిస్టివ్ ఉత్పత్తులను ఫెసిలిటీలో కంపెనీ తయారు చేస్తుందని తెలిపింది. గుజరాత్ లోని సనంద్ లో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని సదరు కంపెనీ పేర్కొంది. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కి ప్రపంచ స్థాయిలో మంచి పేరుంది. బిగ్ ఎగుమతి కేంద్రంగా మారుతుందని విస్పర్ శానిటరీ నాప్ కిన్ తయారీదారు వెల్లడించారు. దీని వల్ల ఇతర కంపెనీలకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉండగా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల గుజరాత్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఇదంతా పీఎం మోదీ చొరవ వల్లనే సాధ్యమైందని పేర్కొంది.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు