PT USHA : నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి ప్రతీక
మహిళా రెజ్లర్లపై ఐఓసీ చైర్మన్ పీటీ ఉష
PT USHA : ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ పీటీ ఉష(PT USHA) షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. వీరి నిరసనపై చులకనగా మాట్లాడారు పీటీ ఉష.
మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజా నిరసన చేపట్టే కంటే ముందు వారి ఆరోపణలు నిజమా కాదా అని తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక కోసం వేచి ఉండక పోతే ఎలా అని ప్రశ్నించాచరు పీటీ ఉష. ఇది పూర్తిగా క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటగాళ్లు వీధుల్లో నిరసనలు చేయకూడదు. కనీసం కమిటీ నివేదిక కోసం ఎందురు చూడాలి. వాళ్లు చేసిన పని ఆటకు , దేశానికి మంచిది కాదన్నారు. ఇది పూర్తిగా ప్రతికూల విధానం తప్ప మరొకటి కాదన్నారు పీటీ ఉష(PT USHA).
ఇదిలా ఉండగా పీటీ ఉష పై నిప్పులు చెరిగారు మహిళా రెజ్లర్లు. ఆమె వ్యాఖ్యలతో బాధ పడ్డామన్నారు. స్వయంగా మహిళ అయి ఉండి తమకు మద్దతు ఇవ్వక పోవడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా తీవ్ర లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం ఇందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరితే తాను రాజీనామా చేస్తానన్నారు. మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దమన్నాడు.
Also Read : అనురాగ్ ఠాకూర్ పై ఫోగట్ ఫైర్