PM Modi : జనహితమే బీజేపీ ఎజెండా – మోడీ
ప్రజా సంక్షేమం ప్రధానం
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ విజన్ ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ ఇచ్చారు ప్రధానమంత్రి. విస్తరించడం, ప్రజల్లో కలిసి పోవడం, జనహితం కోరడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
ఇక నుంచి ప్రతి రోజూ మనకు కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తు బీజేపీదేనని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పార్టీని మరింత విస్తృతం చేయడంలో ఫోకస్ పెట్టాలన్నారు. ప్రస్తుతం మనముందు అతి పెద్ద సవాల్ కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికే మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ లలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిందని చెప్పారు. గుజరాత్ లో ప్రజలు మన ప్రభుత్వ పనితీరుకు బ్రహ్మరథం పట్టారని, ఇవే ఫలితాలు ప్రస్తుతం జరగబోయే తొమ్మిది రాష్ట్రాలలో రిపీట్ కావాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కింది స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న అందరిపై ఉందని కుండ బద్దలు కొట్టారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi). బీజేపీ పాలనలో దేశం సమగ్రతకు హామీ ఇస్తుందన్న విషయం గుర్తించాలన్నారు.
పార్టీ భవిష్యత్తు కోసం మనమంతా కష్టపడాలి. ప్రజల ఆశలకు అనుగుణంగా మనం నడుచు కోవాలని పేర్కొన్నారు ప్రధాని. నరేంద్ర మోదీ ఏకంగా గంట 20 నిమిషాలకు పైగా ప్రసంగించారు.
Also Read : రాహుల్ గాంధీ దమ్మున్నోడు – రాజన్