Punganuru Row : ర‌ణ‌రంగంగా మారిన పుంగ‌నూరు

వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘ‌ర్ష‌ణ

Punganuru Row : పుంగ‌నూరులో టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. స‌భ కొన‌సాగుతుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో వైసీపీ, టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు రాళ్ల వ‌ర్షం కురిసింది. పుంగ‌నూరు పూర్తిగా దాడుల‌తో యుద్ద రంగాన్ని త‌ల‌పింప చేసింది.

Punganuru Row Viral

పోలీసులు భారీగా మోహ‌రించినా ఫ‌లితం లేక పోయింది. అసాంఘిక శ‌క్తుల వ‌ల్ల‌నే ఇది జ‌రిగింద‌ని ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప‌రిస్థితి స‌ద్దు మ‌ణుగ‌క పోవ‌డంతో ఎస్పీ ఆదేశాల మేర‌కు బాష్ప వాయువు ప్ర‌యోగించారు పోలీసులు.

అయితే కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిని తీవ్రంగా ఖండించారు ఎస్పీ. ఇరు వ‌ర్గాల దాడుల్లో పోలీసుల‌కు పెద్ద ఎత్తున గాయాల‌య్యాయి. పోలీసు వాహ‌నాన్ని టీడీపీ శ్రేణులు ద‌గ్ధం చేశారు. ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న స్థానికుల్లో నెల‌కొంది. మ‌రో వైపు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) పెద్దిరెడ్డి పాపం పండే రోజు త‌ప్ప‌క వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : Hardik Pandya : విండీస్ క్రికెట్ బోర్డుపై పాండ్యా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!