KKR vs PBKS IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్(KKR vs PBKS IPL 2022 )కు కోలుకోలేని షాక్ తగిలింది. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 18.2 ఓవర్లలోనే చాప చుట్టేసింది.
దీంతో 137 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రీలంక ప్లేయర్ రాజపక్స ఒక్కడే పంజాబ్ తరపున అత్యధిక స్కోర్ చేశాడు. 31 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇక చివరల్లో కగిసో రబాడా 16 బంతులు ఆడి 25 రన్స్ చేసి గట్టెక్కించాడు.
ఇక కోల్ కోతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ బ్యాటర్లు తల్లడిల్లారు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఉమేష్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. సౌథీ 2 వికెట్లు తీస్తే శివమ్ మావి , సునీల్ సరైన్ , ఆండ్రి రసెల్ చెరో వికెట్ తీశారు.
కోల్ కతా నైట్ రైడర్స్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించారు బౌలర్లు. తమపై నమ్మకం పెట్టుకున్న వారంతా సత్తా చాటారు.
అద్భుతమైన బంతులతో అదరగొట్టారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2022 ప్రారంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను కేకేఆర్ మట్టి కరిపించింది.
ఇక రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఇది మూడో మ్యాచ్. స్కోర్ టార్గెట్ తక్కువగా ఉండడంతో గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
Also Read : కేకేఆర్ దెబ్బకు ఠారెత్తిన పంజాబ్