MI vs PBKS : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తిని రేపింది. చివరి ఓవర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
ఒకానొక దశలో ముంబై ఇండియన్స్ గెలుపు అంచుల దాకా వచ్చి పంజాబ్ కొట్టిన దెబ్బకు బొక్క బోర్లా పడింది. దీంతో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్ . దీంతో ముంబైకి(MI vs PBKS )ఈ మెగా టోర్నీలో వరుసగా ఐదో పరాజయం.
199 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై గెలిచేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసింది. బ్రెవిస్ 49 పరుగులు చేసి సత్తా చాటితే తిలక్ వర్మ 36 , సూర్య కుమార్ యాదవ్ 43 పరుగులతో రాణించారు.
జట్టు విజయంపై నమ్మకం పెంచారు. కానీ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు లేని షాట్లకు పోయి అనవసరంగా వికెట్లును పారేసుకున్నారు. దీంతో చేజేతులారా ఓటమి మూటగట్టుకున్నారు.
పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరు ఓవర్ వేసింది స్మిత్ కావడం విశేషం.
ఇక కగిసో రబాడా 2 వికెట్లు పడగొడితే వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు ముంబై స్కిప్పర్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది.
శిఖర్ ధావన్ 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 52 పరుగులు సాధించాడు. ఇక చివరలో జితేష్ శర్మ మెరుపులు మెరిపించాడు.
Also Read : పృథ్వీ షా టాలెంట్ అద్భుతం