Punjab Kings Loss : పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్

4 వికెట్ల తేడాతో రాజస్థాన్ విక్ట‌రీ

Punjab Kings Loss : ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో శిఖ‌ర్ ధావ‌న్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్(Punjab Kings) చివ‌రి దాకా పోరాడింది. గెలుపు కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , పంజాబ్ కింగ్స్ ఆట‌గాళ్లు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశారు. పంజాబ్ జ‌ట్టు ప‌రంగా ఆట‌గాళ్లు చేసిన కొన్ని త‌ప్పిదాలు ఆ జ‌ట్టును కొంప ముంచేలా చేశాయి. ఫీల్డింగ్ లో నిర్ల‌క్ష్యం, కొన్ని క్యాచ్ ల‌ను విడిచి పెట్ట‌డంతో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలు కావాల్సి వ‌చ్చింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రాజ‌స్తాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు ప‌డింది. బౌల్ట్ , న‌వ‌దీప్ షైనీ బౌలింగ్ దెబ్బ‌కు త‌ల్ల‌డిల్లింది. 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న త‌రుణంలో జితేష్ శ‌ర్మ‌, సామ్ క‌ర‌న్ , షారుఖ్ ఖాన్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. రాజ‌స్థాన్ బౌలర్ల‌ను భ‌ర‌తం ప‌ట్టారు. చాహ‌ల్ వేసిన ఒక్క ఓవ‌ర్ లోనే భారీగా ప‌రుగులు దండుకున్నారు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే బౌల్ట్ దెబ్బ‌కు ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ 2 ప‌రుగుల‌కే చాప చుట్టేశాడు. శిఖ‌ర్ ధావ‌న్ 17 ర‌న్స్ తో నిరాశ ప‌రిచాడు. అథ‌ర్వ టైడే 19 ర‌న్స్ , లియామ్ లివింగ్ స్టోన్ 9 ప‌రుగులు చేసి నిరాశ ప‌రిచాడు.

తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ కు భారీ స్కోర్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు సామ్ క‌ర‌న్ . 31 బాల్స్ ఆడి 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 49 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. జితేశ్ శ‌ర్మ ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. 28 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్ చేశాడు. అనంత‌రం షారుఖ్ ఖాన్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 41 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : PBKS vs RR IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!