Punjab Kings Retention : అగ‌ర్వాల్ ను వ‌దులుకున్న పంజాబ్

తొమ్మిది మంది ఆట‌గాళ్ల‌కు బిగ్ షాక్

Punjab Kings Retention : ఎవ‌రైనా స‌రే ఆడే ఆటగాళ్ల‌కే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. కోట్లు కురిపించేందుకు ఆస‌క్తి చూపుతారు. ఒక ర‌కంగా ఐపీఎల్ అనేది వ‌ర‌ల్డ్ లోనే అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన లీగ్. ఇందు కోసం పెద్ద ఎత్తున దేశ‌, విదేశీ ఆట‌గాళ్లు పోటీ ప‌డ‌తారు. ఒక్కోసారి అనుకోని రీతిలో భారీ ధ‌ర కూడా రావ‌చ్చు.

ఇక దేశీ వాళి ఆట‌లో దుమ్ము రేపిన మ‌యాంక్ అగ‌ర్వాల్ కు ఈసారి చెక్ పెట్టింది పంజాబ్ కింగ్స్(Punjab Kings Retention) యాజ‌మాన్యం. రిటైన్ , రిలీజ్ లో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

విడుద‌ల చేసిన జాబితాలో మ‌యాంక్ అగ‌ర్వాల్ , ఒడియ‌న్ స్మిత్ , వైభ‌వ్ అరోరా, బెన్నీ హూవెల్ , ఇషాన్ పోరేల్, అన్ష్ ప‌టేల్ , ప్రేర‌క్ మ‌న్క‌డ్ , సందీప్ శ‌ర్మ‌, రిటిక్ చ‌ట‌ర్జీల‌ను వ‌దిలేసుకుంది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే రిటైన్ జాబితాలో ఎప్ప‌టి లాగే స్టార్ వెట‌ర‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కు కెప్టెన్సీ అప్ప‌గించింది. ఇక జ‌ట్టులో షారుఖ్ ఖాన్ , బెయిర్ స్టో, ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ , భానుక రాజ‌ప‌క్స‌, జితేశ్ శ‌ర‌ర్మ‌, రాజ్ బావా, రిషి ధావ‌న్ , లివింగ్ స్టోన్ , అథ‌ర్వ తైడే , అర్ష్ దీప్ సింగ్ , బ‌ల్తేజ్ సింగ్ , నాథ‌న్ ఎల్లిస్ , క‌సిగో ర‌బాడా, రాహుల్ చాహ‌ర్ , హ‌ర్ ప్రీత్ ఉన్నారు.

ఐపీఎల్ 2023కు సంబంధించి కేర‌ళ‌లోని కొచ్చిలో మినీ వేలం పాట కొన‌సాగుతుంది. ఈ మేర‌కు అన్ని జ‌ట్లు త‌మ రిటైన్ లిస్టుల‌ను ప్ర‌క‌టించాయి. ఒక ర‌కంగా మ‌యాంక్ కు కోలుకోలేని దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : క‌మిన్స్ ..బిల్లింగ్స్ ..ర‌హానే..పింఛ్ కు ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!