Puri : సినీ రివ్యూలు రాసేవాళ్లందరికీ నా విన్నపం: పూరీ జగన్నాథ్
ఆ ప్లాఫ్ చిత్రాలతోనే ఇండస్ట్రీ బతుకుతోంది..నిర్మాతను బతకనివ్వండి
ముఖ్యంగా మీడియాలో రివ్యూలు రాసేవాళ్లు నిర్మాతను దృష్టిలో పెట్టుకొని రాయండి..కొత్త డైరెక్టర్లను దృష్టిలో పెట్టుకొని రాయండి..కొత్త టెక్నిషియన్ల గొప్పతనాన్ని రాయండి. హీరోలు దగ్గర నుంచి అందరి భవిష్యత్తు ఆ ప్లాఫ్ చిత్రాలపైనే ఆధారపడి ఉన్నాయి. మీ రివ్యూ కారణంగా ఆ డైరెక్టరుకి మళ్లీ అవకాశం రాకపోవచ్చు..ఆ నిర్మాత ఇండస్ట్రీలో కనిపించకపోవచ్చు.. ఆ రివ్యూ వల్ల మీకు వచ్చే రేటింగ్స్ ఎంత ఉంటాయో తెలీదు కానీ..కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాత..ఆ షూటింగ్ జరిగిన అన్నిరోజులు హీరోయిన్ స్టార్ హోటల్ లో ఉంటే బిల్లులు కడతారు..కార్లు పెడతారు..షూటింగ్ లో పాల్గొన్న 24 ఫ్రేమ్స్ విభాగాల్లో అందరికీ భోజనాలు పెడతారు..
అందులో ఒక్క లైట్ బాయ్ లేకపోయినా షూటింగు జరగదు.. వీళ్లందరూ డబ్బులు తీసుకొని హాయిగా వెళ్లిపోతారు. సినిమా విడుదలయ్యే రోజు రాత్రి నిర్మాతకు నిద్ర పట్టదు. ఏ మాత్రం అటూ ఇటైనా నిర్మాతకు నష్టం..అయితే ప్లాఫ్ సినిమాని మీరెలా డిసైడ్ చేస్తారు. అదే ప్లాఫ్ అనుకోండి..మూడురోజుల వరకు ఆగ గలిగితే..ఆ సినిమాకి సగం డబ్బులైనా వచ్చే ఛాన్స్ ఉంది.
అదే మొదటిషో పడకుండానే ప్లాఫ్ అని రాస్తే.. రెండో షోకి జనం ఉండటం లేదు. అది మీ రివ్యూలిచ్చే రేటింగుల పరిస్థితి..కొద్దిగా ఆలోచించండి అని చెప్పారు.అలాగే ఏడాదికి 200 సినిమాలు వస్తే అందులో పది మాత్రమే హిట్ అవుతున్నాయి. మిగిలిన 190 చిత్రాలు కూడా ఇండస్ట్రీలో కార్మికులను బతికిస్తున్నాయి. ఎవరూ ప్లాఫ్ తీయాలని అనుకోరు. దురదృష్టవశాత్తూ ఒక ప్లాఫ్ వస్తే మీ రాతల వల్ల అది అట్టర్ ప్లాఫ్ అయిపోతుంది..దయచేసి సహకరించండి..ఇండస్ట్రీని బతికించండి..రివ్యూలు నిజాయితీగా రాయండి అని కోరారు.