Pushpa Movie : రికార్డుల వేట‌లో పుష్ప‌రాజ్

హిందీలో రూ. 100 కోట్ల మార్క్

Pushpa Movie : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప(Pushpa Movie) విడుద‌లై దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము రేపుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్ . తాజాగా మ‌రో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెర కెక్కించారు.

తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీలో విడుద‌ల చేశారు. అన్ని భాష‌ల్లో బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి అందించిన సంగీతం దుమ్ము రేపింది.

దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు ఇప్ప‌టికీ టాప్ లో ఉన్నాయి. యూట్యూబ్ ను, సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అన్ని చార్ట్ ల‌లో టాప్ లో నిలిచాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న రిలీజ్ అయ్యింది.

క‌రోనా స‌మ‌యంలో సైతం ఈ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ(Pushpa Movie) సృష్టించింది. 2021లో భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అతి పెద్ద గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది పుష్ప‌.

బ‌న్నీ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్లు సృష్టించిన చిత్రంగా నిలిచింది. పాట‌లు, డైలాగులు, మ్యాన‌రిజం విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఇక హిందీలో విడుద‌లై ఏకంగా రూ. 100 కోట్లు కొల్ల‌గొట్టింద‌ని పుష్ప మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించడం సినిమాకు ఉన్న ద‌మ్ము ఏంటో తెలియ చెప్పింది. ఓటీటీలో విడుద‌లైన త‌ర్వాత కూడా బిగ్ రెస్పాన్స్ రావ‌డం విశేషం.

Also Read : బిగ్ బాస్ విన్న‌ర్ తేజ‌స్వి ప్ర‌కాష్

Leave A Reply

Your Email Id will not be published!