Appalayagunta : 6న అప్ప‌లాయ‌గుంట‌లో పుష్ప యాగం

ఘ‌నంగా స్వామికి అంకురార్ప‌ణ

Appalayagunta : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ప‌రిధి లోని తిరుప‌తికి స‌మీపంలో కొలువై ఉన్న అప్ప‌లాయ‌గుంట లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలో జూలై 6న గురువారం పుష్ప యాగం జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించి బుధ‌వారం రాత్రి అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఆల‌యంలో గ‌త మే 31 నుంచి జూన్ 8వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ రంగ వైభవంగా నిర్వ‌హించింది టీటీడీ.

ఈ ఉత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అత్యంత ప్ర‌కృతి సిద్ద‌మైన ప్రాంతంలో స్వామి వారు కొలువు తీరారు. ప్ర‌తి ఏటా అప్ప‌లాయ‌గుంట‌లో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మే నుంచి జూన్ వ‌ర‌కు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కాగా ఉత్స‌వాలు పూర్త‌యిన త‌ర్వాత ఏమైనా లోపాలు జ‌రిగి ఉంటే వాటికి ప్రాయ‌శ్చితంగా పుష్ప యాగం నిర్వ‌హిస్తారు.

ఇందుకు గాను గురువారం ఉద‌యం 10.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ ప్ర‌సన్న వేంక‌టేశ్వ‌ర స్వామికి స్న‌ప‌న తిరుమంజ‌నం చేప‌డ‌తారు. ఇందులో పాలు,పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు , త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పుష్ప యాగ‌గం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హిస్తారు.

Also Read : AP Additional AG : రామోజీరావును కోర్టులో నిల‌బెడ‌తాం

Leave A Reply

Your Email Id will not be published!