Muttaiah Muralitharan : శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఆకలి కేకలు, ఆర్త నాదాలతో దద్దరిల్లుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఏకంగా రాష్ట్రపతి భవనంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.
ఆహారం, ఆయిల్ దొరకడం లేదు. 1948 తర్వాత ఎన్నడూ లేని దుర్బర పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎమర్జెనీ ప్రకటించాడు దేశాధ్యక్షుడు రాజపక్స.
ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు 26 మంది మంత్రివర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. భారత దేశం ఒక్కటే శ్రీలంకకు బాసటగా నిలిచింది.
40 వేల లీటర్ల డీజిల్ ను పంపించింది. మరో వైపు తాత్కాలికంగా నలుగురితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు దేశాధ్యక్షుడు. ప్రతిపక్షాలు సైతం ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానించాడు.
కానీ విపక్షాలు తిప్పికొట్టాయి. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తప్పుకున్నాడు. తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది శ్రీలంక. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన మాజీ దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్(Muttaiah Muralitharan )స్పందించాడు.
ఆయన ఇండియాలో ఉన్నారు. జాతి, మతం, పార్టీలను పక్కన పెట్టి దేశం కోసం ఒక్కటి కావాలని పిలుపునిచ్చాడు. ఇలా చేస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్క గలమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇది ఒక్క రోజులో వచ్చింది కాదన్నాడు. గత కొన్నేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు మురళీధరన్(Muttaiah Muralitharan ). ఇండియా, చైనా లాంటి దేశాలు ఆదుకోవాలని కోరాడు.
ఇదిలా ఉండగా ముత్తయ్య మురళీధరన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దేశం ముఖ్యమన్న ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : ఆర్సీబీకి షాక్..మ్యాచ్ కు ‘మాక్స్’ దూరం