Putin : మాతృభూమి కోసం సైనికుల పోరాటం
ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin : ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు మాతృభూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.
రెండవ ప్రపంచ యుద్దంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించిన సందర్భంగా మాస్కో లోని రెడ్ స్క్వేర్ లో విక్టరీ పరేడ్ లో పుతిన్(Putin) ప్రసంగించారు.
ఈ సందర్భంగా కవాతు చేపట్టారు. ఉక్రెయిన్ పై యుద్దం చేయడాన్ని ఆయన మరోసారి సమర్థించుకున్నాడు. సైనిక జోక్యం అత్యంత అవసరమన్నారు.
ఎందుకంటే పశ్చిమ దేశాలు మన పవిత్ర భూమిపై దాడి చేయాలని అనుకుంటున్నాయని ఈ తరుణంలో యుద్దం చేయడం అత్యవసరంగా మారిందన్నారు.
మనం ఏమిటో, మన సత్తా ఏపాటిదో ఈ ప్రపంచానికి తెలియ చెప్పేందుకే సైనిక చర్యకు దిగడం జరిగిందని చెప్పారు. తాము కావాలని కయ్యానికి కాలు దువ్వ లేదని చెప్పారు
పుతిన్(Putin). తమపై కొన్ని శక్తులు దాడులకు దిగాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. రష్యా కు ఉన్న పవర్ ఏపాటిదో చూపించేందుకే యుద్దానికి దిగామని చెప్పారు పుతిన్.
ఈ ధర్మయుద్దంలో అంతిమ విజయం రష్యాదేనని స్పష్టం చేశారు. ప్రధానంగా రష్యాకు చెందిన సైనిక దళాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయని, వారికి దేశం పట్ల ఉన్న మమకారం , భక్తి, గౌరవం ఏమిటో దీని ద్వారా తెలుస్తోందన్నారు.
యుద్దంలో పోరాడి అమరులైన సైనికులకు ఈ సందర్బంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఉక్రెయిన్ కు అమెరికా అండ – జిల్ బైడెన్