PV Satheesh Comment : చిరు ధాన్యాలపై చెరగని సంతకం
ఇక సెలవంటూ వెళ్లి పోయిన పీవీ సతీష్
PV Satheesh Comment : ఎవరీ మిల్లెట్ మ్యాన్ అనుకుంటున్నారా. తృణ ధాన్యాలకు, సంప్రదాయ పంటలకు ప్రాణం పోసిన వ్యక్తి. ఒక్కడే తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది మహిళలను శక్తివంతమైన విజేతలుగా మార్చిన మనిషి. తెలంగాణలోని జహీరాబాద్ లో పీవీ సతీష్ డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీని ఏర్పాటు చేశారు పీవీ సంతీష్ .
77 ఏళ్ల వయస్సులో ఆయన సెలవంటూ వెళ్లి పోయారు. తృణ ధాన్యాలు ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు. చిన్న అడుగుతో మొదలైన ఈ ప్రస్థానం లక్షలాది మందికి స్పూర్తి కలిగించేలా చేసింది.
ఇవాళ అందుకే పీవీ సతీష్(PV Satheesh Comment) ను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇవాళ ఆయన లేక పోవచ్చు..భౌతికంగా..కానీ ఆయన చేసిన సంతకం ఎప్పటికీ చెరిగే ఉంటుంది. పేదలతో స్వచ్చంధ గ్రామ స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. పలు గ్రామాలలో ఎక్కడికి వెళ్లినా డీడీఎస్ అంటే గుర్తు పడతారు.
మూడున్నర దశాబ్దాలకు పైగా ఇది పేదలతో , రైతులతో, మహిళలతో మమేకమైంది. వారిలో నూతన ఉత్సాహాన్ని, బతుకు మీద భరోసాను కల్పించింది. ఈ సొసైటీలో వేలాది మంది మహిళా సభ్యులుఉన్నారు. కమ్యూనిటీలలోని పేదలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తృణ ధాన్యాలతో సహవాసం చేశారు. వాటిని పండిస్తున్నారు. ఆదర్శంగా నిలిచేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు పీవీ సతీష్. వీరిలో ఎక్కువ మంది దళితులే ఉండడం విశేషం.
సొసైటీ ద్వారా ప్రజలతో నిరంతరం సంభాషణలు, చర్చలు , విద్యా పరమైన, ఇతర కార్యకలాపాల ను నిర్వహించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు పీవీ సతీష్. గ్రామీణ మహిళలు సమాజంలో తమదైన ముద్ర ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
వనరులను గుర్తించడం , వాటిని ఉపయోగించుకునేలా చేయడంపై ఫోకస్ పెట్టారు. భూ సంరక్షణను ఎలా కాపాడు కోవాలనే దానిపై అవగాహన కల్పించారు పీవీ సతీష్(PV Satheesh).
ఆహార ఉత్పత్తిపై, విత్తనాలపై, సహజ వనరులపై స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేలా, స్వయం మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవడం, అటామనస్ మీడియాను ఏర్పాటు చేశారు. డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ రేడియోను కూడా ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేశారు. ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో పీవీ సతీష్ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే.
1985 నుంచడి వేలాది ఎకరాలు తిరిగి సాగులోకి వచ్చేలా చేశారు. ప్రతి సంవత్సరం 3 మిలియన్ కిలోల ధాన్యాన్ని పండిస్తున్నారు. 1996 నుండి పీడీఎస్ ను రూపొందించారు. ఆహార ధాన్యాల ద్వారా వేలాది మంది ఆకలిని తీర్చేలా చేసింది.
కమ్యూనిటీ జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయడంలో ఫోకస్ పెట్టారు. మొత్తంగా డీడీఎస్ పెద్ద దిక్కును కోల్పోయింది. లక్షలాది పేదలు, మహిళలకు అండగా ఉంటూ వచ్చిన చేతి కర్రను కోల్పోయింది. పీవీ సతీష్ సర్ సెల్యూట్.
Also Read : పడిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా