Qin Gang Jai Shankar : జై శంకర్ తో క్విన్ గ్యాంగ్ భేటీ
సరిహద్దు ప్రాంతాల్లో శాంతిపై చర్చ
Qin Gang Jai Shankar : చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్(Qin Gang Jai Shankar) గురువారం న్యూ ఢిల్లీలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని చర్చించారు.
ద్వైపాక్షిక సంబంధాలు, జి20 ఎజెండా, ప్రస్తుత సవాళ్లకు సంబంధించిన అంశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. తమ చర్చలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు జై శంకర్. ద్వైపాక్షిక సంబంధాలకు ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టామని తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత గురించే ఎక్కువగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఇదిలా ఉండగా క్విన్ గ్యాంగ్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడు.
ఇటీవలే ఆయనను ఆ దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా ప్రమోట్ చేశారు. ప్రస్తుతం భారత దేశం జి20 ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తోంది. ఇవాళ, రేపు న్యూ ఢిల్లీలో ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో సమావేశాలు కొనసాగుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రసంగించారు. మరో వైపు జై శంకర్(Jai Shankar) కీలక ఉపన్యాసం చేశారు. ఈ మొత్తం పరిణామాలకు ఐక్య రాజ్య సమితి సరిగా వ్యవహరించక పోవడం వల్లనే జరిగిందని ఆరోపించారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం లేక పోవడం వల్లనే ఇలా జరుగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చైనా, భారత దేశాల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : శాంతి ప్రక్రియకు భారత్ సిద్దం – మోదీ