Quinton De Kock : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆసిస్ స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో దుమ్ము రేపితే దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ క్వింటన్ డికాక్ (Quinton De Kock )దుమ్ము రేపాడు.
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 150 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను విజయ తీరాలకు చేర్చాడు.
ఏకంగా 80 రన్స్ చేసి దుమ్ము రేపాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇలా కూడా ఆడతారా అనుకునేలా విస్తు పోయేలా చేశాడు. సఫారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్(Quinton De Kock )ఈసారి లక్నో ఓన్ చేసుకుంది.
ప్రపంచ స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఎలాంటి బౌలింగ్ అయినా సరే సులభంగా బంతుల్ని బౌండరీ లైన్లను దాటించడం డికాక్ కు సాటి రారు ఎవరూ. 2012లో జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.
లీగ్ టీ20 లో లయన్స్ తరపున ఆడాడు. ముంబై ఇండియన్స్ కి వ్యతిరేకంగా తన జట్టుకు అద్భుతమైన సపోర్ట్ చేశాడు. డికాక్ ఇండియాతో జరిగిన వన్డే సీరీస్ లో వరసుగా మూడు సెంచరీలు చేసి సత్తా చాటాడు డికాక్.
దీంతో ఒక్కసారిగా ఎవరీ డికాక్ అంటూ ఎదురు చూసేలా చేశాడు. ఒక్కసారి మైదానంలో కుదురు కున్నాడంటే ఇక ఆపడం ఎవరి తరం కాదు. 2016లో డికాక్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ వంటి లెజెండ్స్ ను తలపించేలా సత్తా చాటాడు.
Also Read : భారత్ సహాయం జయసూర్య సంతోషం