Quinton De Kock : రెచ్చి పోయిన క్వింట‌న్ డికాక్

29 బంతులు 50 ర‌న్స్ 4 ఫోర్లు 3 సిక్స‌ర్లు

Quinton De Kock : 15వ సీజ‌న్ ఐపీఎల్ లో నూత‌న ఎంట్రీ ఇచ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద్భుత విజ‌యాలు న‌మోదు చేసి దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు గెలుపొంది 16 పాయింట్లు సాధించింది.

బీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి ల‌క్నో. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నోకు కోలుకోలేని షాక్ త‌గిలింది.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత‌మైన బంతికి ఊహించ‌ని రీతిలో ల‌క్నో స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్ ర‌నౌట్ అయి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు.

ఈ త‌రుణంలో క్రీజులోకి వ‌చ్చిన క్వింటాన్ డికాక్(Quinton De Kock) దుమ్ము రేపాడు. ల‌క్నో స్కోర్ లో కీల‌క పాత్ర పోషించాడు. డికాక్ కేవ‌లం 29 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచ‌రీ చేశాడు.

ఇందులో 4 ఫోర్లు 3 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ధ‌నా ధ‌న్ షాట్ల‌తో అల‌రించాడు. ల‌క్నో అభిమానుల‌కు ఫుల్ జోష్ నింపాడు(Quinton De Kock). దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 176 ప‌రుగులు చేసింది.

దీంతో 75 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి దూసుకు వెళ్లింది. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఇంకా రెండు జ‌ట్లు ఏవి ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ‌రిలో ఉన్నాయి. ఏ జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

 

Also Read : దీప‌క్ హూడా సూప‌ర్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!