R Ashwin : తిప్పేసిన అశ్విన్ బెంగ‌ళూరు ప‌రేషాన్

అద్భుత‌మైన బౌలింగ్ తో కిరాక్

R Ashwin : ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంత‌మూ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగింది. నువ్వా నేనా అన్న రీతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగింది.

ఆర్సీబీ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డం జ‌రిగింది. కానీ రియాన్ ప‌రాగ్ రాజ‌స్థాన్ కు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ అందించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.

ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా చివ‌రి దాకా ఉన్నాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఏకంగా 56 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్ లో ఏకంగా 18 ర‌న్స్ చేశాడు.

దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 144 ర‌న్స్ చేసింది. ఆర్సీబీకి బ‌ల‌మైన బ్యాటింగ్ బ‌లం ఉంది. అంతే కాదు చేసిన స్కోర్ భారీదేమీ కాదు. దీంతో ఆర్సీబీ అభిమానులు త‌మ జ‌ట్టు గెలుస్తుంద‌ని భావించారు.

కానీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌రోసారి స‌త్తా చాటింది. రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శించింది. బ్యాటింగ్ లో విఫ‌ల‌మైనా బౌలింగ్ లో అద్భుతంగా రాణించింది. రాజ‌స్థాన్ బౌల‌ర్లలో కుల్ దీప్ సేన్ తో పాటు రవిచంద్ర‌న్ అశ్విన్(R Ashwin) పూర్తిగా మ్యాచ్ ను తిప్పేశారు.

త‌మ అద్భుత‌మైన బంతుల‌తో క‌ట్ట‌డి చేశారు. అంతే కాదు జ‌ట్టుకు విజ‌యం చేకూర్చి పెట్టే ద‌మ్మున్న ప్లేయ‌ర్ దినేశ్ కార్తీక్ ను అద్భుత‌మైన బంతికి ర‌నౌట్ చేయ‌డం ఆ జ‌ట్టు ఫీల్డింగ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ర‌విచంద్ర‌న్ అశ్విన్ మూడు వికెట్లు ప‌డ‌గొడితే కుల్దీప్ సేన్ 4 వికెట్లు కూల్చాడు.

Also Read : ముస్తాక్ ను మ‌రిచి పోలేన‌న్న బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!