Rachin Ravindra : ర‌చిన్ ర‌వీంద్ర రికార్డ్

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెన్సేష‌న్

Rachin Ravindra : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు కీల‌క‌మైన విజ‌యాలు సాధించాయి. ఇక తొలి జ‌ట్టు సెమీస్ కు వెళ్లింది రోహిత్ సేన నేతృత్వంలోని టీమిండియా. ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచ్ లు ఆడింది. అన్ని మ్యాచ్ లు గెలుపొందింది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ పై క‌న్నేసింది.

Rachin Ravindra Records Viral

అయితే మ‌న జ‌ట్టుకు ప్ర‌ధాన అడ్డంకిగా ఉన్నాయి ఆస్ట్రేలియా, కీవీస్, స‌ఫారీ, ఆఫ్గ‌నిస్తాన్ ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ లో న్యూజిలాండ్ జ‌ట్టుకు చెందిన ర‌చిన్ ర‌వీంద్ర(Rachin Ravindra) సెన్సేషన్ గా మారాడు. అరుదైన రికార్డు న‌మోదు చేశాడు.

ఈ టోర్నీలో ఏకంగా మ‌నోడు మూడు సెంచ‌రీలు సాధించాడు. 25 ఏళ్ల లోపు చూస్తే ప్ర‌పంచ క‌ప్ లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన తొలి బ్యాట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. త‌నకు ఇప్పుడు 23 ఏళ్ల 351 రోజులు. ఇదిలా ఉండ‌గా ఇదే రికార్డును భార‌త మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 23 ఏళ్ల 313 రోజుల వ‌య‌సులో వ‌ర‌ల్డ్ క‌ప్ లో 2 సెంచ‌రీలు సాధించాడు. దానిని ఛేదించాడు ర‌చిన్ ర‌వీంద్ర‌.

అద్భుతాన్ని క్రియేట్ చేసిన ర‌చిన్ ర‌వీంద్ర‌ను ప్ర‌స్తుత క్రికెట‌ర్ల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు సైతం ఆకాశానికి ఎత్తేశారు.

Also Read : Tummala Nageswara Rao : కోట్లు కుమ్మ‌రించినా కారు పంక్చ‌రే

Leave A Reply

Your Email Id will not be published!