Radhika Merchant Mehendi : మెరిసిన రాధికా మ‌ర్చంట్

గ్రాండ్ గా మెహందీ ఫంక్ష‌న్

Radhika Merchant Mehendi : రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీకి కాబోయే కోడ‌లు రాధికా మ‌ర్చంట్(Radhika Merchant Mehendi)  వైర‌ల్ గా మారారు. మెహందీ ఫంక్ష‌న్ గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా రాధికా మ‌ర్చంట్ పూల లెహంగాలో పోల్కీ ఆభ‌ర‌ణాలు, రోజ్ మేక‌ప్ లుక్ తో క‌ట్టి ప‌డేశారు.

ప్ర‌స్తుతం ఆమెకు సంబంధించిన మెహందీ ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినీ తారాల‌ను త‌ల‌పించేలా రాధికా మ‌ర్చంట్ డ్రెస్సులు డిజైన్ చేశారు. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసింది రిల‌య‌న్స్ ఫ్యామిలీ. త‌మ తాహ‌తుకు మించి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు ఈ మెహందీ ఫంక్ష‌న్ కు.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ లో రాజ‌స్థాన్ లోని శ్రీ‌నాథ్ జీ ఆల‌యంలో అనంత్ అంబానీ , రాధికా మ‌ర్చంట్ క‌లిసి రోకా వేడుక‌లు చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఇద్ద‌రు ఫ్యామిలీలు వ్యాపార కుటుంబాల‌కు చెందిన‌వి కావ‌డం విశేషం. ఒక ర‌కంగా చెప్పాలంటే అంబానీ కుటుంబానికి కొత్త ఏడాది పండుగ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వీరిద్ద‌రూ ఒక్క‌టయ్యేందుకు రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. స‌న్నిహిత మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య రాజ‌స్థాన్ లో నిశ్చితార్థం జ‌రిగింది. ముంబైలో గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేశారు ముఖేష్ అంబానీ. ఇక రాధికా మ‌ర్చంట్(Radhika Merchant Mehendi)  త‌న రోకా వేడుక త‌ర్వాత మెహందీ ఫంక్ష‌న్ కోసం ప్ర‌త్యేకంగా గులాబీ వ‌ర్ణంతో చేసిన లెహంగాలో మెరిసి పోయింది. ముసి ముసి న‌వ్వులు చిందిస్తూ హొయ‌లు పోయింది.

Also Read : ఐశ్య‌ర్య రాయ్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!