Rafael Nadal : చ‌రిత్ర సృష్టించిన రాఫెల్ నాదల్

21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత‌

Rafael Nadal : స్పెయిన్ కు చెందిన రాఫెల్ నాద‌ల్ చ‌రిత్ర సృష్టించాడు. త‌న కెరీర్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందాడు. ఐదు సెట్ల‌లో ర‌ష్యాకు చెందిన మెద్వెదేవ్ ను ఓడించి త‌న‌కు ఎదురు లేద‌ని చాటాడు.

ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ వేదిక‌గా జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియ‌న్ షిప్ పురుషుల సింగిల్స్ ఫైన‌ల్స్ లో డేనియ‌ల్ ను ఓడించాడు. ఐదు గంట‌ల పాటు హోరా హోరీగా ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది.

ఈ మ్యాచ్ లో రాఫెల్ నాద‌ల్(Rafael Nadal) 2-6, 6-7, 6-4, 7-5 తో మెద్వెదేవ్ పై గెలుపొందారు. గ్రాండ్ స్లామ్ గేమ్ ను గెలుపొందేందుకు నాద‌ల్ రెండు సెట్ల నుండి 14 ఏళ్ల‌కు పైగా రావడం ఇదే మొద‌టిసారి.

చివ‌ర‌గా 2007లో జ‌రిగిన వింబుల్డెన్ లో ర‌ష్యాకు చెందిన మిఖాయిల్ యూజ్నీని నాలుగో రౌండ్ లో ఓడించి విజ‌యం సాధించాడు.

కాగా స్విట్జ‌ర్లాండ్ కు చెందిన రోజ‌ర్ ఫెడ‌ర‌ర్ , సెర్బియాకు చెందిన నోవాక్ జుకోవిచ్ ల కంటే ముందు 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల‌ను గెలుచుకున్న మొద‌టి టెన్నిస్ ప్లేయ‌ర్ గా స్పానియార్డ్ నిలిచాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మ్యాచ్ లో గ‌ట్టి పోటీ ఇచ్చాడు రాఫెల్ నాదల్ (Rafael Nadal)కు . నాద‌ల్ స‌ర్వీస్ ను రెండు సార్లు బ్రేక్ చేశాడు. 42 నిమిషాల్లో దానిని స‌ర్వ్ చేయ‌డం తో మొద‌టి సెట్ ను 6-2 తో కైవసం చేసుకున్నాడు.

నాద‌ల్ డ్యూస్ కి తిరిగి రావ‌డానికి పాయింట్ ను కాపాడుకున్నాడు. కానీ సెట్ పాయింట్ ను వృధా చేశాడు. మూడో సెట్ లో 6-4తో గెల‌వ‌డంలో ఓ అద్భుత‌మైన మ‌లుపు తిరిగింది.

నాద‌ల్ నాల్గ‌వ సెట్ లో త‌న దాడిని కొన‌సాగించాడు. త‌న ఎనిమిదో ప్ర‌య‌త్నంలో ర‌ష్య‌న్ ఆట‌గాడి ఆధిక్యాన్ని బ‌ద్ద‌లు కొట్టాడు.

Also Read : వ‌ర‌ల్డ్ జెయింట్స్ ‘లెజెండ్స్’ ఛాంపియ‌న్

Leave A Reply

Your Email Id will not be published!