Raghav Chadha : బీజేపీ పంతం కేజ్రీవాల్ అంతం – చద్దా
సంచలన కామెంట్స్ చేసిన ఆప్ ఎంపీ
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే. దేశంలో ప్రతిపక్ష పార్టీలు అంటూ ఉండకూడదు.
ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మతం ఒకే భాష ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ కంట్లో నలుసు లాగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను భావిస్తున్నారని ఆరోపించారు రాఘవ్ చద్దా(Raghav Chadha) .
ఎక్సైజ్ పాలసీలో అమలులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు చేస్తూ సీబీఐ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా ఉన్న కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం లేకుండా, ఆర్డర్ ఇవ్వకుండా ఎలా సర్కార్ అమలు చేస్తుందని ప్రశ్నించారు.
ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే భద్రతా దళాలను కాదని సీఎం కేజ్రీవాల్ ను చంపాలని ఇంటిపైకి ఉసిగొల్పింది.
ఇది దేశ ప్రజలందరూ కళ్లారా చూశారన్నారు. ప్రస్తుతం కాషాయ పార్టీ ఎజెండా ఒక్కటే రాబోయే ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోదీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఒక్క అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే ఉందన్నారు.
అందుకే ఆయనను ఢీకొనే ధైర్యం లేకనే ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు రాఘవ్ చద్దా. అరవింద్ కేజ్రీవాల్ ను అంతం చేయాలని బీజేపీ భావిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ.
ఇదిలా ఉండగా రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడి