Raghav Chadha : ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా – రాఘవ్ చద్దా
పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడం నేరం ఎలా అవుతుందని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రత్యేకించి ఆప్ , ఇతర భారత టీం మెంబర్లను కావాలని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Raghav Chadha Asked
మీరు పనిగట్టుకుని సస్పెండ్ చేసినా , నోటీసులు పంపించినా తాము ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్యగా రాఘవ్ చద్దా ఆరోపించారు. ఇలాంటివి ఇంకోసారి చేయవద్దని ఆయన కోరారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి, మనం రాసుకున్న రాజ్యాంగానికి తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయని అన్నారు ఎంపీ.
స్పీకర్ స్థానంలో ఉన్న చైర్మన్ జవాబు చెప్పాలి. అసలు తాను చేసిన నేరం ఏమిటి అనేది. అది చెప్పకుండా సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజమని రాఘవ్ చద్దా(Raghav Chadha) మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన నిర్ణయంగా కొట్టి పారేశారు. దీనిని దేశ ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు.
Also Read : Sri Lanka Squad Asia Cup 2023 : శ్రీలంక విజేతగా నిలుస్తాందా
