Raghuram Rajan Comment : రాజ‌న్ మార్గం దేశానికి అవ‌స‌రం

ఆయ‌న ఆవేద‌న‌ను అర్థం చేసుకోక పోతే ఎలా

Raghuram Rajan Comment  : ఏ దేశ‌మైనా అభివృద్ది సాధించాలంటే ఆర్థికంగా బాగుండాలి. దానికి నిరంత‌రం క‌స‌ర‌త్తు అవ‌స‌రం. అంత‌కు మించి నిత్యం ఒడిదుడుల‌కు లోన‌య్యే ఈ రంగాన్ని గాడిన పెట్టాలంటే సుశిక్షుతులైన ఆర్థిక వేత్త‌ల మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అవ‌స‌రం. ప్ర‌తి దానిని వ్యాపార దృక్ఫ‌థంతో చూస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ధైర్యంగా హెచ్చ‌రించిన ఆర్థిక‌వేత్త ర‌ఘురామ్ రాజ‌న్. ఆయ‌న జ‌గ‌మెరిగిన అరుదైన ఆర్థిక వేత్త‌. అందుకేనేమో త‌ను ఉంటే బ‌డా బాబులకు, వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ల‌బ్ది చేకూర్చ‌లేమ‌ని ఆలోంచింది బీజేపీ స‌ర్కార్. ఆర్థిక రంగానికి వాచ్ డాగ్ లాగా ఉన్న ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు ర‌ఘురామ్ రాజ‌న్(Raghuram Rajan) ను. ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లు పెట్టారు. చివ‌ర‌కు ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీ అనుకూల వాదిగా ముద్ర వేశారు. రాజ‌న్ తో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ జ‌రిపిన సంభాష‌ణ‌లో సామాన్య పౌరుడికి సైతం విడ‌మ‌ర్చి చెప్పిన తీరు ప్ర‌శంస‌నీయం. ఆలోచ‌న‌లో ఆచ‌ర‌ణ‌లో ఎక్క‌డా అడుగు త‌ప్ప‌ని నైజం రాజ‌న్ ది.

ఆర్థిక రంగంపై ఖ‌రాఖండిగా చెప్పిన వారిలో ఆయ‌న కూడా ఒక‌రు. ఇండియా ఫ‌ర్ సేల్ అన్న‌ది ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ద్ర‌వ్యోల్బ‌ణం , నిరుద్యోగం పెరుగుతోంద‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చారు రాజ‌న్(Rajan). కానీ ప‌ట్టించు కోలేదు. ఇప్ప‌టికీ ప్ర‌పంచంలో ఎన్న‌ద‌గిన ఆర్థిక‌వేత్త‌ల‌లో ఒకడిగా గుర్తింపు పొందినా ఎక్క‌డా త‌ను వాస్త‌వాల‌ను దాచుకోలేదు. రాబోయే రోజుల్లో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని చేసిన హెచ్చ‌రిక‌ల‌ను ప్ర‌స్తుత స‌ర్కార్ పెడ‌చెవిన పెట్ట‌డం గ‌మ‌నార్హం. తన దేశ‌భ‌క్తిని శంకించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు రాజ‌న్. యావ‌త్ ప్ర‌పంచం ఆయ‌న కోసం వేచి చూస్తోంది. కార‌ణం ది బెస్ట్ పాల‌సీల‌ను త‌యారు చేయ‌డంలో ఆయ‌న అందెవేసిన చేయి. ఆర్థిక రంగానికి సంబంధించి ఎప్పటిక‌ప్పుడు పాఠాలు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇదీ ఆయ‌న నైజం. నిత్యం పాఠ‌కుడే కాదు ర‌చ‌యిత కూడా. అంత‌కు మించిన వ‌క్త‌. లెక్క‌లేన‌న్ని ప‌త్రాలు , అంత‌కు మించిన ఉప‌న్యాసాలు ఇచ్చారు ర‌ఘురామ్ రాజ‌న్. చీఫ్ ఎకనామిస్ట్ గా , ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ గా, రీసెర్చ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు.

బ్యాంకింగ్ , కార్పొరేట్ ఫైనాన్స్ , ఆర్థిక అభివృద్దికి సంబంధించి విస్తృతంగా రాశారు. రాజ‌న్(Rajan) రాసిన పుస్త‌కాల‌లో థ‌ర్డ్ పిల్ల‌ర్ : హౌ ద స్టేట్ అండ్ మార్కెట్స్ ఆర్ లీవ్ క‌మ్యూనిటీస్ బిహైండ్ , ఐ డూ వాట్ ఐ డూ .. ఆన్ రిఫార్మ్స్ , వ‌ర‌ల్డ్ ఎకాన‌మీ, త‌దిత‌ర అంశాల‌కు సంబంధి పుస్త‌కాలు రాశారు. వ‌ర‌ల్డ్ ఎకాన‌మీకి సంబంధించి 2010లో ప్ర‌పంచంలో అత్యుత్త‌మ పుస్త‌కంగా టైమ్స్ గోల్డ్ మ‌న్ సాక్స్ బ‌హుమ‌తి పొందారు.అంతే కాదు అమెరిక‌న్ ఫైనాన్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ , యుఎస్ అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స‌భ్యుడిగా ఉన్నారు. ఉత్త‌మ ఆర్థిక పరిశోధ‌కుడిగా యుఎస్ ఏ గౌర‌వించింది. స‌త్క‌రించింది. లెక్క‌లేన‌న్ని అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు రఘురామ్ రాజన్. ఆయ‌న లౌకిక వాదాన్ని న‌మ్ముతారు. అంత‌కు మించి స‌మాజాన్ని, మానవీయ కోణాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే ఆర్థిక రంగం బ‌ల‌ప‌డాలంటే కులం, మ‌తం, విద్వేష రాజ‌కీయాలు ఉండ‌కూడ‌దంటారు. ఈ మాన‌వీయ ఆర్థిక కోణం అర్థం చేసుకోనంత కాలం ఇలాంటి ఒడిదుడుకులు త‌ప్ప‌వు. రాజ‌న్ మార్గం అనుస‌ర‌ణీయం కాదంటారా.

Also Read : AAP Support : ఆర్డినెన్స్ కు మ‌ద్ద‌తిస్తే క‌లుస్తాం

Leave A Reply

Your Email Id will not be published!