Raghuram Rajan Rahul : రాహుల్ గాంధీ దమ్మున్నోడు – రాజన్
పప్పు కాదు ఫైర్ ఉన్నోడంటూ కితాబు
Raghuram Rajan Rahul : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ని పప్పు అంటూ భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేస్తూ వచ్చింది. ఆయన పప్పు కాదని దమ్మున్నోడని కితాబు ఇచ్చాడు. రాహుల్ గాంధీ పరిపూర్ణమైన నాయకుడని కితాబు ఇచ్చారు.
దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలని, తనకు మతం కంటే మానవత్వం ముఖ్యమని స్పష్టం చేశారు యువ నాయకుడు రాహుల్ గాంధీ. గత ఏడాది 2022 సెప్టెంబర్ 7న తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టారు. జనవరి 31న జమ్మూ కాశ్మీర్ లో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.
150 రోజులకు పైగా కొనసాగింది పాదయాత్ర. లక్షలాది మంది రాహుల్ గాంధీతో కనెక్ట్ అయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రెటీలు , క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, ఆర్మీ మాజీ ఆఫీసర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు.
ఈ క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) కూడా పాల్గొన్నారు. ఆయనతో రాహుల్ గాంధీ వివిధ అంశాలపై సంభాషించారు. 2023 భారత ఆర్థిక వ్యవస్థకు , ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా కష్టంగా ఉంటుందని హెచ్చరించారు రఘురామ్ రాజన్.
రాహుల్ గాంధీ ఏ విధంగానూ మూర్ఖుడు (పప్పు) కాదు..ఆయన తెలివి కలిగిన నాయకుడు అని ఆర్బీఐ మాజీ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : ఆర్థిక వ్యవస్థపై రాజన్ కామెంట్స్