Wasim Jaffer : రాహుల్ కంటే ర‌హానే బెట‌ర్

వ‌సీం జాఫ‌ర్ సంచ‌ల‌న కామెంట్

Wasim Jaffer  : భార‌త మాజీ క్రికెట‌ర్, మాజీ కోచ్ వసీం జాఫ‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్ర‌స్తుతం స‌ఫారీ టూర్ లో ఉంది. మూడు టెస్టులు, మూడు వ‌న్డే సీరీస్ లలో ఆడాల్సి ఉండ‌గా ఇప్ప‌టికే రెండు టెస్టు మ్యాచ్ లు పూర్త‌య్యాయి.

భార‌త్ మొద‌టి టెస్టులో విక్ట‌రీ సాధిస్తే సౌతాఫ్రికా రెండో టెస్టులో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో ఇరు జ‌ట్లు చెరి స‌మానంగా విజ‌యం సాధించాయి.

ముచ్చ‌ట‌గా మూడో టెస్టు ఈనెల 11న జ‌ర‌గ‌నుంది. దీంతో నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా రెండో టెస్టుకు తీవ్ర గాయం కార‌ణంగా విరాట్ కోహ్లీ దూర‌మ‌య్యాడు.

వెన్నుముక మ‌రోసారి నొప్పి కావ‌డంతో అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది బీసీసీఐ. మ‌రో వైపు టీ20తో పాటు వ‌న్డే సీరీస్ కు కోహ్లీని త‌ప్పించింది భార‌తీయ సెలెక్ష‌న్ క‌మిటీ.

అత‌డి స్థానంలో రోహిత్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది. ఈ త‌రుణంలో రెండో టెస్టు ఓడి పోవ‌డంపై సీరియ‌స్ గా స్పందించాడు వసీం జాఫ‌ర్(Wasim Jaffer ). సెలెక్ష‌న్ క‌మిటీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను కేఎల్ రాహుల్ కు కాకుండా అజింక్యా ర‌హానే కు అప్ప‌గించి ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేద‌న్నాడు. రహానే అందుబాటులో ఉన్న‌ప్పుడు రాహుల్ ను ఎంపిక చేయ‌డం పూర్తిగా త‌ప్పు అని పేర్కొన్నాడు జాఫ‌ర్.

ప్ర‌స్తుతం వసీం చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : మూడో టెస్టుకు సిరాజ్ క‌ష్ట‌మే

Leave A Reply

Your Email Id will not be published!