Rahmanullah Gurbaz : గుజరాత్ భరతం పట్టిన గుర్బాజ్
39 బాల్స్ 5 ఫోర్లు 7 సిక్సర్లు 81 రన్స్
Rahmanullah Gurbaz : డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసినా, వరుసగా మూడో విజయం అందుకున్నా ప్రత్యర్థి జట్టుకు చెందిన కోల్ కతా నట్ రైడర్స్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) చుక్కలు చూపించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసింది కోల్ కతా. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తగ్గలేదు. స్టార్ బౌలర్లు షమీ, లిటిల్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ ఇలా ప్రతి బౌలర్ ను ఏకి పారేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహ్మనుల్లా గుర్బాజ్ 5 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయాడు. బుల్లెట్ల లాగా దూసుకు పోయాయి మైదానంలో. మొత్తం 81 రన్స్ చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించాడు. అంతే కాదు మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. జట్టుకు గౌరవ ప్రదమైన పరుగులు చేయడంలో సహాయ పడ్డాడు గుర్బాజ్. మైదానంలో రహ్మనుల్లా ఉన్నంత వరకు గుజరాత్ ఊపిరి పీల్చుకోలేదు.
ఇక చివరలో వచ్చిన మరోస్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 రన్స్ చేశాడు. మొత్తంగా రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా కోల్ కతా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
Also Read : మరోసారి మెరిసిన శుభ్ మన్ గిల్