Rahul Gehlot Adani : రాహుల్ విమర్శ గెహ్లాట్ ప్రశంస
వారెవ్వా గౌతమ్ అదానీనా మాజాకా
Rahul Gehlot Adani : రాజకీయం వ్యాపారం వేర్వేరు కాదని తేలి పోయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాలిటిక్స్ , బిజినెస్ కలిసి ప్రయాణం సాగిస్తున్నాయి. ఇక భారత్ లో ఈ రెండు రంగాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలకు వ్యాపారాలకు చాలా వ్యత్యాసం ఉండేది.
అంతకు మించి దూరం కూడా ఉండేది. కానీ సీన్ మారింది. ఇవాళ రెండు రంగాలు కలిసి సాగుతున్నాయి. చెట్టా పట్టాలు వేసుకుని పరుగులు తీస్తున్నాయి. ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉంటూ నిర్ణయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. వ్యాపారవేత్తలు ఇవాళ అన్ని రంగాలకు విస్తరించారు.
ప్రధానంగా దేశాన్ని ప్రభావితం చేసే టెలికాం, లాజిస్టిక్, ఐటీ, ఆయిల్, గ్యాస్ ఇలా ప్రతి రంగంపై దిగ్గజ వ్యాపారవేత్తలు ప్రవేశించారు. ఇదే సమయంలో నలుగురు లేదా ఐదుగురు వ్యాపారవేత్తల కనుసన్నలలోనే భారత్ కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనినే పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
ఆయన అదానీని, ముకేష్ , టాటాలను టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఆయన పార్టీకి చెందిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం వ్యాపారవేత్త గౌతమ్ అదానీని(Rahul Gehlot Adani) ఆకాశానికి ఎత్తేశారు. ఆయన అద్భుతమైన వ్యాపారవేత్త అంటూ కితాబు ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా వ్యాపారవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేషరతుగా మద్దతు ఇవ్వడంపై రాహుల్ మండిపడ్డారు. పదే పదే ఎత్తి చూపారు కూడా. కానీ సీన్ మారింది. రాజస్థాన్ ఇన్వెస్ట్ 2022 సదస్సులో గౌతమ్ అదానీ పాల్గొన్నారు. పార్టీలు వేరైనా వ్యాపారవేత్తలతో కలిసే ఉంటారని ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు అదానీ, గెహ్లాట్.
Also Read : గౌతం అదానీపై అశోక్ గెహ్లాట్ కితాబు