Rahul Dravid Comment : రాహుల్ ద్రవిడ్ ను తప్పిస్తారా..?
మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగిస్తారా
Rahul Dravid Comment : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం మూట గట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
సంప్రదాయ ఆట తీరును ఎక్కువగా ఇష్టపడే రాహుల్ ద్రవిడ్ కొత్తదనం, ఆధునికతను సంతరించుకున్న పొట్టి ఫార్మాట్ (టి20)కు సరిపోడన్న అపవాదు మూటగట్టుకున్నాడు. ఇది పక్కన పెడితే రవిశాస్త్రి హెడ్ కోచ్ గా తప్పుకున్నాక బీసీసీఐ నానా తంటాలు పడింది. ఇప్పటి వరకు కెప్టెన్ , కోచ్ కుదురు కోలేదు.
ఏకంగా ప్రపంచంలో ఏ జట్టు చేయనన్ని ప్రయోగాలు చేసింది మూడు ఫార్మాట్ లకు సంబంధించి. ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్లను మార్చింది. ఈ తరుణంలో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ది వాల్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీని రీ ప్లేస్ చేస్తారని టాక్.
బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఆటగాడిగా, వ్యక్తిగా ఎలాంటి ఆరోపణలు చేసేందుకు వీలు లేదు రాహుల్
ద్రవిడ్ గురించి. కానీ జట్టుకు సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేయడంలో కొంత దూకుడుగా వ్యవహరించడం లేదన్న విమర్శలు లేక పోలేదు.
ఇది పక్కన పెడితే రాహుల్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ను పంపించింది బీసీసీఐ. ఇక మిగతా దేశాలలో ప్రధానంగా ఇంగ్లండ్ లో ఆ దేశ క్రికెట్ బోర్డు
కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ జట్టుకు సెపరేట్ గా కెప్టెన్ , కోచ్ లను నియమించింది. దీంతో వాళ్లు పూర్తిగా ప్రొఫెషనల్స్ గా మారి పోతున్నాయి. ఇదే సమయంలో భారత్ క్రికెట్
బోర్డు విషయానికి వచ్చే సరికల్లా అది ఉండడం లేదని మాజీ ఆటగాళ్లు వాపోతున్నారు.
మరో వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం కూడా జట్టుకు భారంగా మారిందన్నది ప్రధాన ఆరోపణ.
ఇక రాహుల్ ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా నియమించిన సమయంలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ సీన్ వేరుగా ఉంది. అపజయాలతో పాటు
విజయాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న టీమిండియా కూర్పులోనే ఏదో లోపం ఉందన్నది వాస్తవం. ఇక బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏం చేస్తుందో ఎవరిని ఎంపిక చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇదే ఆడుతున్న ఆటగాళ్లను వదిలేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇక రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే మెరికల్లాంటి ఆటగాళ్లు జట్టుకు
వచ్చారు. ప్రధానంగా ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్న వారంతా ఇప్పుడు ఆయన శిష్యులే కావడం విశేషం.
మొత్తంగా ద్రవిడ్ ను తీసేస్తారా లేక ధోనీకి వేరే బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : సన్ రైజర్స్ దగ్గర రూ. 42.25 కోట్లు