Rahul Dravid : ర‌న్ మెషీన్ కు ది వాల్ అభినంద‌న

పాక్ పై భార‌త్ గెలుపులో కోహ్లీ పాత్ర‌

Rahul Dravid : ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ అద్బుత‌మైన ప్ర‌తిభా పాటవాల‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న‌దైన శైలితో మ‌రోసారి సూప‌ర్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన పాకిస్తాన్ పై ఉత్కంఠ భ‌రిత గెలుపు సాధించింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా సూప‌ర్ -12 లో కీల‌క మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో స‌త్తా చాటింది.

కేవ‌లం 53 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 82 ప‌రుగులు చేశాడు. విజ‌యం అనంత‌రం కోహ్లీ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ విరాట్(Rahul Dravid) ను ప్ర‌త్యేకంగా అభినందించాడు. ఇత‌ర టీం స‌భ్యుల‌ను ఆలింగ‌నం చేసుకున్నాడు. 64 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న స‌మ‌యంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా విజ‌య‌పు అంచుల తీరుల్లోకి తీసుకు వెళ్లాడు.

త‌న కెరీర్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ సాధించడంలో కీల‌క పాత్ర పోషించాడు. ల‌క్ష మంది హాజ‌రైన స్టేడియంలో ఒకే ఒక్క‌డు ఫినిష‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఫామ్ అన్న‌ది స్వ‌ల్ప‌మే కానీ క్లాసిక్ అన్న‌ది శాశ్వ‌తం అని నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఛేజింగ్ కింగ్ అని నిరూపించాడు.

31 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ జ‌ట్టు ఓడి పోయింద‌ని అనుకున్నారు. కానీ అంచ‌నాల‌ను మించి భార‌త్ జ‌ట్టు స‌క్సెస్ వైపు తీసుకు వ‌చ్చాడు. యావ‌త్ భార‌తం విరాట్ కోహ్లీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది.

Also Read : పాకిస్తాన్ పై విజ‌యం కోహ్లీ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!