Rishi Sunak Dravid : ద్ర‌విడ్ వ్య‌క్తిత్వం ఇష్టం – పీఎం

రిషి సున‌క్ సంచ‌న కామెంట్స్

Rishi Sunak Dravid : భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ , మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు యునైటెడ్ కింగ్ డమ్ ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్ . ద్ర‌విడ్ అద్భుత‌మైన ఆట‌గాడు మాత్ర‌మే కాద‌ని, అత్యున్న‌త‌మైన విలువ‌లు క‌లిగిన వ్య‌క్తి అని ప్ర‌శంసించారు. రాహుల్ వ్య‌క్తిత్వం అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం రిషి సున‌క్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. మైదానంలో ఉన్నా లేక బ‌య‌ట ఉన్నా చాలా ప్ర‌శాంతంగా ఉండ‌టం ద్ర‌విడ్ కు మాత్ర‌మే చెందింద‌న్నారు. ఆట ప‌ట్ల అంకిత భావం, ప‌ట్టుద‌ల‌, అంత‌కు మించిన నిండైన ప‌ల‌క‌రింపు ఎవ‌రినైనా ఇట్టే ఆక‌ట్టుకునేలా చేస్తుంద‌న్నారు రిషి సున‌క్.

ద్ర‌విడ్ ఆడే టెక్నిక్ కూడా త‌న‌ను అమితంగా ఆక‌ర్షించింద‌ని చెప్పాడు. బ్రిటీష్ న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్బంగా త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించాడు రిషి సున‌క్(Rishi Sunak). అత‌డు మైదానంలో ఆట‌గాళ్ల ప‌ట్ల , ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల క్రికెట‌ర్ల ప‌ట్ల ప్ర‌వ‌ర్తించే తీరు త‌న‌ను ఇష్ట‌ప‌డేలా చేసేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నాడు. నేను లండ‌న్ లో ఎంతో మంది గొప్ప గొప్ప ఆట‌గాళ్ల‌ను చూశాన‌ని కానీ రాహుల్ ద్ర‌విడ్ లాగా త‌న‌ను ఆక‌ట్టుకోలేద‌ని స్ప‌ష్టం చేశాడు బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సున‌క్.

Also Read : President Murmu KCR : ద్రౌప‌ది ముర్ముకు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!