Rahul Dravid : ‘సెక్సీ’ పదం వద్ద ఆగి పోయిన ద్రవిడ్
భారత హెడ్ కోచ్ కామెంట్స్ వైరల్
Rahul Dravid : ఆసియా కప్ 2022 లో భాగంగా సూపర్ -4 కింద ఆదివారం కీలకమైన మ్యాచ్ దాయాదుల మధ్య జరగనుంది. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) మీడియాతో మాట్లాడారు.
బౌలింగ్ విషయంపై మాట్లాడుతుండగా గ్లామర్ అనే పదాన్ని వాడాడు. కానీ సెక్సీ అన్న పదం వరకు వచ్చే సరికల్లా దాట వేశాడు. దీంతో అక్కడ ఉన్న మీడియా అంతా విస్తు పోవడం వారి వంతైంది.
అందుకే వరల్డ్ క్రికెట్ లో అతడిని పర్ ఫెక్ట్ జెంటిల్మెన్ గా పేర్కొంటారు. భారత బౌలింగ్ ఎటాక్ అనేది గ్లామర్ గా కనిపించక పోయినా వారు ఎలా పని చేస్తారనే దాని గురించి మాట్లాడారు.
దీన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఆ పదం వాడేందుకు నానా తంటాలు పడ్డాడు. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
గ్లామర్ వాడాడు కానీ సెక్సీ అన్న పదం వాడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆయన తెలివి తేటలకు, సమయ స్పూర్తికి ఫిదా అయ్యారు మీడియా జనం.
సదరు పదాన్ని వాడకుండానే శీఘ్రమైన తెలివిని ప్రదర్శించాడు. ఇదే సమయంలో భారత్ పై పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ బాగా పని చేస్తోందన్నాడు.
తమ లైనప్ కూడా బాగానే ఉందని పేర్కొన్నాడు రాహుల్ ద్రవిడ్. వారి బౌలింగ్ లో బలం ఉంది. ఒప్పుకుంటా. కానీ మా బౌలింగ్ లో కూడా సత్తా ఉంది అందుకే 147 రన్స్ కే కట్టడి చేశామన్నాడు హెడ్ కోచ్.
Also Read : యుద్దానికి దాయాదులు సిద్దం