Rahul Gandhi : హర్యానా ఎన్నికల ఫలితాల పై మొదటిసారి స్పందించిన రాహుల్

జమ్మూకశ్మీర్‌లో తమను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు రాహుల్ మరో ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు...

Rahul Gandhi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురుకావడం, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తొలిసారి స్పందించారు. హర్యానాలో ఊహించని ఫలితాలు రావడంపై తమ పార్టీ విశ్లేషణ చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో కౌటింగ్ సమయంలో అవకతవకలు జరగినట్టు పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ నేతలు చేస్తున్న ఫిర్యాదులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నిరంతరం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు. ప్రజల హక్కుల కోసం, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల గళాన్ని తాము వినిపిస్తూనే ఉంటామన్నారు.

Rahul Gandhi Comment

జమ్మూకశ్మీర్‌లో తమను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు రాహుల్ మరో ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయమని, ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయమని అభివర్ణించారు. కాగా, హర్యానా కౌంటింగ్ ప్రక్రియలో పలు అవకతవకలు జరిగాయని, కొన్ని జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. హర్యానా ఎగ్జిట్ ఫలితాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకే పరిమితమై మెజారిటీ మార్క్‌కు దూరంగా ఉండిపోయింది.

Also Read : AP Home Minister : విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!