Rahul Gandhi : కాంగ్రెస్ సర్కార్ ప్రజా దర్బార్
ప్రగతి భవన్ మార్పు ప్రజా పరిపాలనా భవన్
Rahul Gandhi : వరంగల్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇప్పటి దాకా తెలంగాణ పేరుతో కేసీఆర్ సర్కార్ దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.
Rahul Gandhi Challenge
24 గంటల పాటు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రకటించారు. రాష్ట్ర పాలకుడు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. కేవలం 72 గంటల లోపు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
తాము ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు దళితులను, అన్ని వర్గాలను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు . ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తప్పకుండా తామే పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ.
42 పేజలతో 68 హామీలను ఇవ్వడం జరిగిందని వీటిని తప్పనిసరి అమలు చేసి తీరుతామన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్త జన సందోహం