Rahul Gandhi : బాంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్రానికి ప్రశ్నలు సంధించిన రాహుల్
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కానీ...
Rahul Gandhi : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి నిన్న ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌ను మూడు కీలక ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడిపై దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అనుసరించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమిటని జై శంకర్‌ని రాహుల్ అడిగారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని.. వీలైనంత త్వరగా ఏదో ఒక స్టెప్ తీసుకుంటామని జై శంకర్ తెలిపారు.
Rahul Gandhi Comment
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కానీ.. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రమేయం ఏమైనా ఉందా? అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని జై శంకర్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక ఘటనలను ప్రతిబింబించేలా పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు నిత్యం తన సోషల్ మీడియాలో పిక్స్ పెడుతున్నారని కూడా ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం. బంగ్లాదేశ్‌లో నాటకీయ పరిణామాలను కేంద్రం ముందే ఊహించిందా? అని కూడా రాహుల్(Rahul Gandhi) ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి సమాధానమిస్తూ.. పరిస్థితిని భారత్ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.
సమావేశం తరువాత, విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రతిపక్షాల ఏకగ్రీవ మద్దతును అభినందిస్తూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి ఈరోజు పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో క్లుప్తంగా చెప్పానని.. దీనిని ఏకగ్రీవంగా అందించిన మద్దతును అభినందిస్తున్నానని తెలిపారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఈరోజు పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్ వివరించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అది ఈ స్థాయికి ఎలా చేరుకుందనే విషయాలను అన్ని పార్టీల ఎంపీలకు కేంద్రం వివరించింది. బంగ్లాదేశ్ పరిస్థితిని గురించి.. ఆమె నివాసాన్ని నిరసనకారులు ముట్టడించడంతో హసీనా భారతదేశానికి ఎలా వచ్చారనే విషయాలను సైతం జై శంకర్ వివరించారు.
Also Read : CM MK Stalin : ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి పదవిపై అప్డేట్