Rahul Gandhi : నా బలం ఏంటో చెప్పమన్న ఈడీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది.
దీని ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి సమన్లు పంపించింది. అయితే సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ గత వారంలో మూడు రోజుల పాటు హాజరయ్యారు. బుధవారం కూడా ఈడీ ఆయనను ప్రశ్నించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాను.
ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు. ఎందుకంటే తామేమీ తప్పులు చేయలేదు. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గి వాళ్లు కేసు నమోదు చేశారని, తనను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారని నాకు తెలుసు.
వాళ్లకు ఇంకా బాగా తెలుసన్నాడు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో 30 గంటలకు పైగా ఈడీ తనను ప్రశ్నించిందన్నారు.
కాగా నా వెనుక ఉన్న శక్తి ఏంటో, ఇంత సహనంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారంటూ తనను ఈడీ ప్రశ్నించిందని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
నేను బహిర్గతం చేయలేనని వారికి చెప్పానని తెలిపారు. తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సరదాగా చెప్పారు.
Also Read : ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే దాడి కలకలం