Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతికి సీఎం పదవి ఆఫర్ చేశామని కానీ పట్టించు కోలేదన్నారు.
అయతే సీబీఐ, ఈడీ, పెగాసస్ కారణంగానే యూపీలో అధికార బీజేపీకి మాయావతి సపోర్ట్ చేశారంటూ ఆరోపించారు. మాయావతితో పొత్తు పెట్టుకుని ఆమెను సీఎం అభ్యర్థిగా చేస్తామని పార్టీ పరంగా ఆఫర్ చేశామన్నారు.
ఆ తర్వాత తమతో మాట్లాడ లేదన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ చీఫ్ పై నిప్పులు చెరిగారు. దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను బీజేపీ టార్గెట్ చేసిందన్నారు.
ప్రధానంగా తనకు నచ్చని వారిని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థలను , కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ఇందులో భాగంగానే బీఎస్పీ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీ వైపు మళ్లిందని సంచలన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఎస్పీలకు కోలుకోలేని షాక్ తగిలింది.
బీఎస్పీకి ఒక సీటు దక్కగా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే లభించాయి. దీంతో రెండు పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ (Rahul Gandhiమాయావతి పై కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ఆయన తాజాగా శరద్ యాదవ్ ను కలిశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు.
Also Read : మోదీ సపోర్ట్ మరిచి పోలేను – గవర్నర్