Rahul Gandhi : షింజో అబే మృతి పట్ల రాహుల్ దిగ్భ్రాంతి
జపాన్, భారత్ దేశాల మధ్య గొప్ప వారధి
Rahul Gandhi : జపాన్ మాజీ ప్రధాన మత్రి షింబో అబే దారుణ హత్య పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గొప్ప నాయకుడిని ప్రత్యేకించి భారత్ తన చిరకాల మిత్రుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా భారత్ కు ఇది తీరని లోటుగా పేర్కొన్నారు.
భారత దేశం, జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో షింజో అబే చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇండో – పసిఫిక్ లో శాశ్వత వారసత్వాన్ని వదిలి వేయడం బాధాకరమని, ఒక రకంగా భారత్ కు, జపాన్ కు, యావత్ ప్రపంచానికి తీరని లోటుగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఆయన కుటుంబానికి, జపాన్ ప్రజలకు తాను సానుభూతి తెలియ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.
శాంతితోనే సమాజం ఉన్నతి సాధిస్తుందని తెలుసు కోవాలని స్పష్టం చేశారు. ఈ తరం నాయకులలో అత్యంత ప్రభావంతమైన నాయకుడిగా షింజో అబే ఒకరు అని ప్రశంసించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
మరో వైపు భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను శాశ్వత మిత్రుడిని కోల్పోయానని వాపోయారు.
ఇదిలా ఉండగా షింజో అబే చైనా పట్ల కఠినంగా ఉన్నారు. వ్యవహరించారు కూడా. చైనా అంటే డోంట్ కేర్ అని పేర్కొన్న దిగ్గజ నాయకుడు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగుసార్లు ఇండియాకు వచ్చారు.
Also Read : కాల్పుల కలకలం ప్రపంచం విస్మయం