Rahul Gandhi : దేశంలో హింస‌కు మోదీదే బాధ్య‌త – రాహుల్

బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థ‌ల బాధ్య‌తా రాహిత్యం

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆర్ఎస్ఎస్, త‌దిత‌ర అనుబంధ సంస్థ‌ల‌ను విరుచుకుప‌డ్డారు.

కేర‌ళ‌లో శుక్ర‌వారం రాహుల్ గాంధీ ప‌ర్య‌టించారు. అంత‌కు ముందు పార్టీ ఆఫీసును సంద‌ర్శించారు. ప‌లువురు నేత‌ల‌తో మాట్లాడారు. అనంత‌రం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్ర‌సంగించారు.

దేశంలో విస్త‌రిస్తున్న హింస‌, ద్వేషానికి ప్ర‌ధాన కార‌ణం మౌనంగా చూస్తూ కూర్చున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనేన‌ని ఆరోపించారు. ఇవాళ సుప్రీంకోర్టు బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది.

ముందూ వెనుకా ఆలోచించ‌కుండా అలా మాట్లాడటం వ‌ల్లే ఇవాళ దేశం అట్టుడుకుతోంద‌ని జ‌స్టిస్ సూర్య‌కాంత్ మండిప‌డ్డారు. బేష‌ర‌త్తుగా నూపుర్ శ‌ర్మ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆదేశించారు.

అంతే కాదు ఎఫ్ఐఆర్ చేసిన వెంట‌నే అరెస్ట్ చేయాల్సిన ఢిల్లీ పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిల‌దీశారు. ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.

ఇప్ప‌టికైనా మోదీ నోరు విప్పాల‌న్నారు. ప్ర‌చార ఆర్భాటం తప్పా ప‌నికొచ్చేది ఏదీ దేశానికి ఇంత వ‌ర‌కు చేయ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి బాధ్య‌త వ‌హించాల్సిందే వారేన‌ని స్ప‌ష్టం చేశారు.

వాయ‌నాడ్ ప్ర‌జ‌ల కార్యాల‌య‌మ‌ని, వామ‌ప‌క్ష పార్టీకి చెందిన కేడ‌ర్ దాడికి పాల్ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. హింస ఎప్పుడూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌ద‌న్నారు. వారి ప‌ట్ల త‌న‌కు కోపం ఉండ‌ద‌న్నారు.

Also Read : మోదీజీ సుప్రీం తీర్పుపై ఏమంటారు

Leave A Reply

Your Email Id will not be published!