Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారని, అది చైనాలో తయారైందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఇందులో 60 మంది చైనా నిపుణులు పాల్గొన్నారని కానీ ఈ విగ్రహాన్ని ఇండియాలో తయారు కాక పోవడం విచిత్రంగా ఉందన్నారు. ఇదే విషయం గురించి టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ప్రస్తుతం సమతామూర్తి విగ్రహ వివాదం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై ఇవాళ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోదీని నిలదీశారు. మేడ్ ఇన్ చైనా కామెంట్లతో హోరెత్తించారు.
నరేంద్ర మోదీపై సెటైర్లు విసిరారు. సమతామూర్తి విగ్రహం చైనాలో తయారైంది. ఇది నవ భారతం, ఆత్మ నిర్భర్ మాత్రం కాదని పేర్కొన్నారు.
చైనా నిర్భర్ అని మోదీ ప్రచారం చేసుకుంటే సరి పోతుందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. దీనిని చైనాలో తయారైందని విషయం తెలిసి ఎందుకు ఆవిష్కరించారంటూ ప్రశ్నించారు.
ఎక్కడికి పోయింది నీ ఆత్మ నిర్భర్ భారత్ అని నిలదీశారు. నవ భారాతానికి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రమాన్ని చైనాకు చెందిన అయిర్సన్ కార్పొరేషన్ రూపొందించింది.
2015లో కాంట్రాక్టు పొందిన సదరు సంస్థ 15 నెలలు తీసుకుంది తయారు చేసింది. కాంట్రాక్టు బిడ్డింగ్ కోసం ఇండియన్ కంపెనీ నిలిచినా దానిని పక్కన పెట్టి చైనాకు అప్పగించడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
Also Read : ముచ్చింతల్ కు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక