Rahul Gandhi : ఈ ధ‌రాభారం ఇంకెంత కాలం – రాహుల్

ఇక‌నైనా శ్రీ‌లంక నుంచి చూసి నేర్చుకోండి

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.

శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ధ‌ర‌ల భారం మోపుతూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఈ ధ‌రా భారాన్ని ఇంకెంత కాలం మోయాల‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 133 కోట్ల భార‌తీయుల‌కు కొలువు తీరిన భార‌తీయ జ‌నతా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం భారంగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొంత మంది పెట్టుడిదారులు, బిలీయ‌నీర్లు, స్నేహితుల కోసం మాత్ర‌మే ప్ర‌ధాని మోదీ(PM Modi) ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌జ‌ల కోసం కాద‌ని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పాల‌న‌లో గ్యాస్ ధ‌ర రూ. 500 లోపు ఉండేద‌ని కానీ గ‌త ఎనిమిదేళ్ల బీజేపీ పాల‌నలో ఏకంగా అంత‌కు రెట్టింపు పెరిగింద‌ని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే ఎల్పీజీ ధ‌ర‌లు 157 శాతానికి పెరిగాయంటూ స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.

పెట్రోల్, డీజిల్ వాత ఇంకో వైపు గ్యాస్ మోత‌తో సామాన్యులు, బ‌డుగులు, బ‌ల‌హీన వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందులకు లోన‌వుతున్నార‌ని ఆవేద‌న చెందారు. రికార్డు స్థాయిలో పెంచ‌డంలో మీరు చ‌రిత్ర సృష్టించారంటూ ఎద్దేవా చేశారు.

గ‌బ్బ‌ర్ ట్యాక్స్ దోపిడీ, నిరుద్యోగ సునామీ ఏదో ఒక రోజు మిమ్మ‌ల్ని క‌బ‌ళించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు రాహుల్ గాంధీ. ఇక‌నైనా మోదీ శ్రీ‌లంకలో చోటు చేసుకున్న సంక్షోభాన్ని, ప్ర‌జాగ్ర‌హాన్ని చూసి నేర్చుకోవాల‌ని సూచించారు.

Also Read : ప్ర‌జ‌లే ప్ర‌భువులు పాల‌కులు సేవ‌కులు

Leave A Reply

Your Email Id will not be published!