Rahul Ramakrishna : ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో చోటు చేసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. టీవీ9 ఛానల్ లో యాంకర్ కు నటుడు విశ్వక్ సేన్ కు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో విశ్వక్ సేన్ నోరు జారారు. దీంతో మండి పడిన యాంకర్ స్టూడియో నుంచి వెళ్లి పోమంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. యాంకర్ పై పరువు నష్టం వేస్తానంటూ హెచ్చరించిన నటుడు ఆ తర్వాత స్వరం మార్చారు.
తాను అన్నది తప్పేనని, క్షమించమని కోరాడు. ఇదిలా ఉండగా తన పట్ల హీరో ప్రవర్తించిన తీరు, వాడిన భాష సరిగా లేదంటూ యాంకర్ దేవి నాగవల్లి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తానంటూ ప్రకటించింది.
ఆమెకు ప్రముఖ సామాజిక కార్యకర్తలు దేవి, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య మద్దతు పలికారు. కాగా కొందరు యాంకర్ కు మద్దతు ఇస్తుంటే ఇంకొందరు నటుడు విశ్వక్ సేన్ కు వంత పాడుతున్నారు.
తాజాగా ప్రముఖ కమెడియన్ గా పేరొందిన రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఈ రాద్దాంతంపై స్పందించారు. ఆయన సదరు ఛానల్ పై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే టీవీ9ను ఏకి పారేశారు.
ఈ ఎపిసోడ్ లో నేనూ భాగం కావాలని అనుకుంటున్నా. నటుడిని అవమానించిన తీరును ఖండిస్తున్నానని తెలిపారు రాహుల్ రామకృష్ణ. జర్నలిస్టుల ముసుగులో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. లైవ్ డిబేట్ కు తాను రెడీగా ఉన్నానంటూ ప్రకటించాడు.
Also Read : బిగ్ బాస్ మోస్ట్ డేంజరస్ షో