Rahul Tewatia : తెవాటియా దెబ్బ పంజాబ్ అబ్బా

గుజ‌రాత్ కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విక్ట‌రీ

Rahul Tewatia  : అందుకేనేమో క్రికెట్ అంటే జ‌నం ప‌డిచ‌స్తారు. ప్రాణం పెడ‌తారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగే మ్యాచ్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు క‌నుక‌.

ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో మ‌రో ఉత్కంఠ భ‌రిత‌మైన పోరుకు తెర తీసింది పంజాబ్ కింగ్స్ , గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య మ్యాచ్. గుజ‌రాత్ స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగులు చేసింది పంజాబ్. లివింగ్ స్టోన్ అద్భుతంగా ఆడాడు. అనంత‌రం 190 ప‌రుగుల టార్గెట్ తో బ‌రి లోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ చివ‌రి బంతి వ‌ర‌కు విజ‌యం ఊరించింది.

19 ఓవ‌ర్లు ముగిశాయి. ఇక ఉన్న‌ది ఒకే ఒక్క ఓవ‌ర్ . అంటే ఆరు బంతులు మాత్ర‌మే. 19 ర‌న్స్ చేయాలి. 4 బంతుల‌లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇంకా 12 ప‌రుగులు చేయాల్సి ఉంది. మిగిలిన‌వి 2 బంతులు.

అంటే రెండు సిక్స్ లు కొడితేనే విజ‌యం సాధిస్తుంది గుజ‌రాత్ టైటాన్స్. ఈ స‌మ‌యంలో సిక్స్ లు కొట్ట‌డం క‌ష్ట‌మే. ఈ త‌రుణంలో అంతా పంజాబ్ కింగ్స్ విజ‌యం ఖాయ‌మ‌ని అనుకున్నారు.

కానీ ఊహించ‌ని రీతిలో గుజ‌రాత్ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు గుజ‌రాత్ ఆట‌గాడు రాహుల్ తెవాటియా(Rahul Tewatia ). ఏకంగా రెండు బంతుల్లో రెండు సిక్స్ లు బాది ఫైన‌ల్ గా ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు.

ఆఖ‌రి ఓవ‌ర్ ను ఓడియ‌న్ స్మిత్ కు ఇచ్చాడు కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్. మొత్తంగా రెండు సిక్స్ ల‌తో మ్యాచ్ ను అద్భుతంగా ముగించాడు.

Also Read : ఆ క్రికెట‌ర్ ఎవ‌రో చెప్పు చ‌హ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!