Rahul Yatra Comment : పౌర సమాజం మేల్కోక పోతే ప్రమాదం
రాజకీయాలకు అతీతంగా రాహుల్ యాత్ర
Rahul Yatra Comment : మేక్ ఇన్ ఇండియా..మన్ కీ బాత్ అంటూ గత ఎనిమిదేళ్లుగా కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ప్రజల్లోకి వెళ్లనుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ తన గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తోంది.
ఇక దేశంలో కేవలం రెండు రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ పవర్ లో ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఆ మేరకు గుజరాత్ లో 27 ఏళ్లుగా బీజేపీ అక్కడ కంటిన్యూగా గెలుస్తూ వస్తోంది.
ఇది ప్రధాని మోదీకి స్వంత రాష్ట్రం. దీంతో గెలిపించే బాధ్యతను తన భుజాల మీదకు వేసుకున్నారు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇటీవల గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీకి ఒక షాపంగా మారింది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం , ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి తెర తీశారు నరేంద్ర మోదీ. కొద్ది మంది పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లు సీరియస్ గా తీసుకుంది.
ఇదే సమయంలో ఊహించని రీతిలో గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానిని, బీజేపీని , దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇందు కోసం దేశానికి కావాల్సింది ద్వేషం కాదు స్నేహం అంటూ భారత్ జోడో యాత్రకు(Rahul Yatra) శ్రీకారం చుట్టారు.
ఆయన చేపట్టిన ఈ యాత్రకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఎక్కడ చూసినా రాహుల్ యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ ఎక్కడా పార్టీకి సంబంధించి మాట్లాడటం లేదు. కేవలం దేశం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఎలా దేశాన్ని అమ్మేస్తున్నారో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల బాధలు, సమస్యలు వింటున్నారు.
ఒక రకంగా ఆయన తనను తాను పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మారారు. అన్ని వర్గాల వారు ప్రస్తుతం రాహుల్ గాంధీలో మరో నాయకుడిని చూస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఒక రకంగా పార్టీకి ఇది బూస్ట్ లాంటిది అని చెప్పక తప్పదు.
Also Read : ప్రపంచ పురోగతిలో భారతీయుల ముద్ర – మోదీ