Sunil Gavaskar : రాహుల్ నైపుణ్యం అద్భుతం – స‌న్నీ

ఆరెంజ్ క్యాప్ రేసులో ల‌క్నో కెప్టెన్

Sunil Gavaskar : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar). ఐపీఎల్ లో నాయ‌కుడిగా రాణిస్తూనే వ్య‌క్తిగతంగా ఆడుతుండ‌డం విశేషం.

ప్ర‌తి షాట్ క‌ళాత్మ‌కంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. చాలా మంది ఆట‌గాళ్లు ఏదో తెచ్చి పెట్టుకున్నట్టు ఆడ‌తారు. కానీ కేఎల్ రాహుల్ అలా కాదు. చాలా ప‌ద్ద‌తిగా ఆడుతాడంటూ కితాబు ఇచ్చాడు స‌న్నీ.

ప్ర‌స్తుతం ఐపీఎల్ 2022 రిచ్ మెగా టోర్నీలో వ్య‌క్తిగ‌త స్కోర్ల‌లో టాప్ 5 గురు ఆట‌గాళ్ల‌లో రాహుల్ కూడా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరెంజ్ క్యాప్ రేసులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ 500 ప‌రుగులు చేసి నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు.

అంతే కాదు ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఆ జ‌ట్టుకు చెందిన స్టార్ బౌల‌ర్ య‌జ్వేంద్ర చ‌హ‌ల్ సూప‌ర్ గా బౌలింగ్ చేస్తూ 18 వికెట్లు ప‌డ‌గొట్టి టాప్ లో నిలిచాడు. ఈ త‌రుణంలో ఎవ‌రూ ఊహంచ‌ని రీతిలో కొత్త‌గా రెండు జ‌ట్లు ఎంట‌ర్ అయ్యాయి.

ఒక‌టి గుజ‌రాత్ టైటాన్స్ కాగా రెండోది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ఆ జ‌ట్టుకు హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఎల్ ఎస్ జీకి రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు.

ఇక రాహుల్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సెంచ‌రీలు బాదాడు. 368 ప‌రుగుల‌తో రెండో ఆట‌గాడిగా నిలిచాడు. రాహుల్ ఆడే ప్ర‌తి షాట్ స‌రైన టెక్స్ట్ బుక్ స్ట్రోక్ అని ప్ర‌శంసించాడు.

Also Read : ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో వార్న‌ర్ కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!