Trains Cancelled : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు 420 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది...

Trains Cancelled : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వర్షాలకు 432రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు మరో 140రైళ్లు దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. వీటిలో సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, పలు పాసింజర్‌ రైళ్లు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Trains Cancelled – ఏపీ, తెలంగాణలో రద్దయిన రైళ్లు ఇవే..

వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా మరో 48 ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ– సికింద్రాబాద్- విజయవాడ, గుంటూరు–సికింద్రాబాద్, కాకినాడ పోర్ట్– లింగంపల్లి, గూడూరు– సికింద్రాబాద్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్ నగర్, భద్రాచలం– బల్లార్షా, కాజీపేట– డోర్నకల్, బల్లార్షా– కాజీపేట, భద్రాచలం– సికింద్రాబాద్, హైదరాబాద్ –షాలిమార్, సికింద్రాబాద్ –విశాఖపట్నం సహా పలు రైళ్లు రద్దయ్యాయి.

Also Read : YS Jagan : ‘వి మిస్ యు డాడీ’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టిన మాజీ సీఎం జగన్

Leave A Reply

Your Email Id will not be published!