Rains Update : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం…మరో రెండు రోజుల వర్షాలు

Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు. ఈ అల్పపీడనం దక్షిణాది జిల్లాల వైపు కదులుతోందని, ఓ వైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఈ అల్పపీడనం కారణంగా రాజధాని నగరం చెన్నైలో బుధ, గురువారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.

Rains Update

ఇదే విధంగా మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌, కడలూరు జిల్లాలు, పుదుచ్చేరిలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వివరించారు.చెన్నై, శివగంగై, రామనాధపురం, తిరుచ్చి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం సహా 11 జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వరకూ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు.

Also Read : Minister Nimmala : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!