Raj Music Director : సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరు
పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం
Raj Music Director : తెలుగు సినిమా రంగంలో విషాదం అలుముకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(Raj Music Director) ఆదివారం కన్ను మూశారు. పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు. రాజ్(Raj) , కోటి ద్వయం పేరొందిన సంగీత దర్శకులు. ఇద్దరూ కలిసి స్వర పేటిక లాగా ఉన్నారు. కానీ విభేదాలు రావడంతో ఆ తర్వాత విడి పోయారు. కోటితో కలిసి సక్సెస్ ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన చరిత్ర రాజ్(Raj) ది. ఆయన వయసు 68 ఏళ్లు.
గుండె పోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. రాజ్ అసలు పేరు సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రాజ్ – కోటి జంట కొన్నేళ్ల పాటు సినీ రంగాన్ని శాసించింది. రాజ్ మృతితో సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ దిగ్గజాలు, దర్శకులు, రచయితలు, కళాకారులు, గాయనీ గాయకులు, నిర్మాతలు , సంగీత దర్శకులు తీవ్ర సంతాపం తెలిపారు.
ఒక సంగీత శిఖరం రాలి పోయిందని పేర్కొన్నారు. మరుపురాని గీతాలకు స్వరాలు కూర్చిన ఘనత రాజ్ కు దక్కుతుందని కొనియాడారు. ఇక రాజ్ – కోటి కలిసి 150కి పైగా సినిమాలకు పని చేశారు. ముఠా మేస్త్రి, బావ బావమరిది, గోవిందా గోవిందా , హలో బ్రదర్ వంటి సినిమాలు అత్యంత పేరు పొందాయి. కోటి నుంచి విడి పోయాక రాజ్ సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు.
Also Read : Jaiswal Rinku Singh Comment