Raj Nath Singh : మా ‘పుష్క‌ర్’ ఫ్ల‌వ‌ర్ కాదు ఫైర్ ఉన్నోడు

రాజ్ నాథ్ సింగ్ నోట పుష్ప మాట

Raj Nath Singh : ఏ ముహూర్తంలో స్టార్ చేశాడో సుకుమార్ కానీ పుష్ప దుమ్ము రేపుతోంది. ఇప్పుడు సినీమా రంగాన్నే కాదు క్రీడా, రాజ‌కీయ‌, ఆధ్యాత్మిక రంగాల‌ను షేక్ చేస్తోంది. ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త గ‌రిక‌పాటి ఏం మెస్సేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారంటూ నిల‌దీశారు.

కానీ ఆయ‌న కామెంట్స్ కు విరుద్దంగా పుష్ప దూసుకు పోతోంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన పుష్ప మూవీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా న‌టించ‌గా స‌మంత స్పెష‌ల్ సాంగ్ చేసి ఉర్రూత‌లూగించింది.

ఊ అంటావా అంటూ ఊపేసింది. ఇప్ప‌టి దాకా రూ. 360 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు టాక్. ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ క‌లెక్ష‌న్ల‌తో పాటు టాప్ చార్ట్స్ లో సినిమాకు చెందిన పాట‌లు నిల‌వ‌డం విశేషం.

ఇక పుష్ప డైలాగులు పేలాయి. త‌గ్గేదేలే, పుష్ప అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా ఫైర్ అంటూ రాయ‌ల‌సీమ యాస‌లో చెప్పిన మాట‌లు దుమ్ము రేపాయి. ఇప్పుడు ఈ డైలాగులు రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా చేశాయి.

తాజాగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Raj Nath Singh)ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పుష్ప‌ర్ సింగ్ ధామీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మా సీఎం పేరులో పుష్ప ఉంది. ఆయ‌న హృద‌యం పుష్ప‌మే కానీ ప‌వ‌ర్ ఉన్న‌డు. ద‌మ్మున్నోడంటూ పుష్ప మూవీ గురించి ప్ర‌స్తావించాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. మ‌రోసారి పుష్ప చిత్రం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : శంక‌ర్..చెర్రీ’ మూవీ క‌థ నాదే

Leave A Reply

Your Email Id will not be published!