Raj Singh Dungarpur : బీసీసీఐకి ఊపిరి పోసిన రాజ్ సింగ్
క్రికెట్ దిగ్గజాన్ని ఎలా మరిచి పోగలం
Raj Singh Dungarpur : భారత దేశంలో క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో రాజ్ సింగ్ దుర్గార్ పూర్(Raj Singh Dungarpur) ఒకరు. ఆయన లేకుండా బీసీసీఐని ఊహించ లేం.
ఇవాళ క్రికెట్ సంస్థకు వేలాది కోట్ల రూపాయలు సమకూరాయంటే ఆయన వేసిన బాటేనని చెప్పక తప్పదు. రాజ్ సింగ్(Raj Singh Dungarpur) ,
కు మొదటి నుంచి క్రికెట్ అంటే ప్రేమ.
ఇదే సమయంలో ఆయన హయాంలోనే కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు 1983లో వరల్డ్ కప్ తీసుకు వచ్చింది. దివంగత గాయని లతా మంగేష్కర్ ను ఒప్పించి ఆటగాళ్లకు డబ్బులు ఇప్పించేందు కోసమని సంగీత కచేరి ఏర్పాటు చేసిన గొప్ప పాలనాదక్షుడు రాజ్ సింగ్.
స్వతహాగా క్రికెటర్ కూడా. 19 డిసెంబర్ 1935లో పుట్టాడు. 12 సెప్టెంబర్ 2009లో చని పోయాడు. బీసీసీఐకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 16 ఏళ్ల పాటు
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
20 ఏళ్లకు పైగా బోర్డు ఆఫ్ కంట్రోల్ లో ఉన్నాడు. రెండు సార్లు జాతీయ జట్టుకు సెలెక్టర్ గా కూడా పని చేశాడు. విదేశీ టూర్ లలో నాలుగు సార్లు
భారత క్రికెట్ జట్టును కూడా నిర్వహించాడు.
సచిన్ టెండూల్కర్ ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్ తో ఆడే జట్టుకు ఎంపిక చేశాడు. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీని స్థాపించిన ఘనత కూడా రాజ్ సింగ్ దుర్గార్ పూర్ దే(Raj Singh Dungarpur) .
రాజస్థాన్ లోని రాజ కుటుంబంలో పుట్టిన ఆయన చివరి వరకు క్రికెట్ ను ప్రేమించాడు. దానిని రాజుగా విరాజిల్లేలా చేశాడు. ఇవాళ వేల కోట్లు
రావడం వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది.
గోల్ఫ్ క్రీడాకారుడు కూడా. ముంబైలో 13 ఏళ్ల పాటు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా చీఫ్ గా ఉన్నాడు. చివరలో పాకిస్తాన్ టూర్ సందర్భంగా
టీమిండియాకు మేనేజర్ గా ఉన్నాడు.
Also Read : వందేమాతరం క్రికెట్ జపం